బంగాల్‌లో బీజేపీ విజయం అనైతికం
- వంద సీట్లకు పైగా అక్రమంగా దక్కించుకున్నది
- ప్రజాతీర్పును సైతం అపహరించింది..
- లోక్‌సభలో బీజేపీ ఎంపీలు 240 మంది
- వీరిలో ప్రతి ఆరో ఎంపీ ఓట్‌చోరీ ద్వారానే గెలిచారు
- ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే బీజేపీకి 140 సీట్లునా దక్కేవి కావు
- ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్
న్యూఢిల్లీ, మే ౬: బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం అనైతికమని, ఎన్నికల సంఘం సహకారంతో ఓట్ చోరీకి పాల్పడి బీజేపీ గెలిచిందని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బుధవా రం సోషల్‌మీడియా వేదికగా సంచలన ఆ రోపణలు చేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీ వంద కంటే ఎక్కువ సీట్లను అక్రమంగా దక్కించుకుని, ప్రజాతీర్పును సైతం అపహరించిందని అభిప్రాయపడ్డారు.
గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రలోనూ ఓట్ చోరీ జరిగిందని, వాటిపై తాను స్వయంగా ఆధారా లు సేకరించి, మీడియా ఎదుట పెట్టానని గుర్తుచేశారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థలన్నీ ఇప్పుడు అధికార బీజేపీ జేబు సంస్థల య్యాయని ఆరోపించారు. ఎన్నికల అవకతవకలు బీజేపీ అత్యధిక సీట్లు దక్కించుకునేం దుకు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఉపయోగపడ్డాయని వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకుంటున్న సంస్థలు కేం ద్రం నియంత్రణలో ఉన్నాయని ఆరోపించారు. కేంద్రంలోని పాలకులు వాటిని రిమో ట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమిని చూసి విపక్షాలు సంతోషించడం సరికాదని హితవు పలికారు. విపక్షాలు చిన్న చిన్న రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి దేశం కోసం అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఐక్య పోరాటాలు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేస్తున్న పోరాటానికి తాము మద్దతు ఇవ్వాలని సూచించారు. లోక్‌సభలోని బీజేపీ ఎం పీల గెలుపు పైనా రాహుల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుత సభలో ఉన్న 240 మంది బీజేపీ ఎంపీ ఉన్నారని, వారిలో ప్రతి ఆరో ఎంపీ ఓట్ చోరీ ద్వారానే గెలిచారని దుయ్యబట్టారు.
దేశంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ పరిస్థితి దారుణం గా ఉంటుందని, అలా చేస్తే ఆ పార్టీకి 140 సీట్లునా దక్కవని ఎద్దేవా చేశారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగి ఉంటే బీజేపీ బలం గణనీయంగా తగ్గిపోయేదని అభిప్రాయపడ్డారు. అక్రమంగా గెలిచిన ఆ ఎంపీలను బీ జేపీ భాషలోనే చొరబాటుదారులని పిలవా లా? అంటూ ప్రశ్నించారు. హర్యానా రాజకీయాలపైనా, అక్కడి బీజేపీ ప్రభుత్వ పాలన పైనా రాహుల్ స్పందించారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చొరబాటుదారు ప్రభుత్వమని విమర్శించారు.






