22 August, 2026 | 6:43 PM

పాఠశాల సిబ్బందికి భద్రత కల్పించాలి : ట్రస్మా సభ్యులు

22-08-2026 06:16 PM

భూపాలపల్లి టౌన్,(విజయాక్రాంతి): నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటనను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ట్రస్మా సభ్యులు ఖండించారు. ఈ మేరకు అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎస్పీ, అదనపు కలెక్టర్ కు వినతిపత్రాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ట్రస్మా సభ్యులు మాట్లాడుతూ పాఠశాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో విధులు నిర్వర్తించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బందికి రక్షణ కల్పించేందుకు అవసరం అయిన మార్గదర్శకాలు, భద్రతా చర్యలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షులు ఉడుత సాంబయ్య, జనరల్ సెక్రటరీ ఎస్ శ్రీనివాస్ రావు, ట్రెజరర్ జి సతీష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.