ప్రాథమిక విద్యకు కొలాం పిల్లలు దూరం
చదువులు లేక తిరుగుతున్న బడి ఈడు పిల్లలు
ఉట్నూర్, జూలై 9 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి(Inderavelli) మండలం గట్టేపల్లి పంచాయతీ పరిధిలోని గట్టేపల్లి కొలంగూడాలోని బడి ఈడు పిల్లలకు సర్కారు విద్య అందనంత దూరంలో ఉంది. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బడిబాట కార్యక్రమాలు(Badi Bata programs) నిర్వహిస్తుంది. బడిబాట కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి పిల్లలను పాఠశాలకు పంపి విద్య నేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. కానీ పాఠశాలలో లేని గూడాలోని బడి ఈడు పిల్లలకు ప్రాథమిక విద్య అందరి ద్రాక్ష గానే మిగిలింది.
గట్టేపల్లి కొలం గుడలో బడి ఈడు పిల్లలు 12 మంది చదువులకు దూరమై దినమంతా ఆటల్లోనే మునిగి తేలుతున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి కనీసం రెండవ తరగతి వరకు గూడెంలో చదువులు చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించిన ఉపాధ్యాయుని కేటాయించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఒకపక్క కొలంగిరిజనులు చదువులకు దూరంగా ఉన్నారని విద్యాశాఖ అధికారులు గుర్తించిన వారికి విద్యా బోధన చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
గట్టేపల్లి కొలం గుడలో కేంద్ర ప్రభుత్వం(Central Government) జన్మన్ యోజన పథకం కింద 60 లక్షలతో పక్కా భవనం నిర్మించి రెండేళ్లు అవుతున్న ఆ భవనం తాళం నీటికి తెరవడం లేదు. ఇప్పటికైనా ఐటీడీ ఏ అధికారులు తగిన చర్యలు తీసుకొని కొలం గిరిజన పిల్లలకు ప్రాథమిక విద్యను అందించి, మూడవ తరగతి నుండి కొలం గిరిజనుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక శాటిలైట్ ఆశ్రమ పాఠశాలకు తీసుకువెళ్లి చదివిస్తామని గ్రామస్తులు అంటున్నారు. ఐటిడి ఏ అధికారులు తగిన చర్యలు తీసుకొని చిన్నారులకు విద్యా బోధన జరిగే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.







