13 March, 2026 | 10:06 PM

ఉపసర్పంచులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

13-03-2026 03:16 PM
  1. లేకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తాం
  2. అప్పటి ప్రభుత్వం అన్ని ఆలోచించే ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చింది
  3. ఉప సర్పంచ్ల చెక్ పవర్ తీసేసే అధికారం ఎవరికి లేదు 
  4. కొత్తూరు పాపి రస్ పోర్ట్ లో ఉప సర్పంచ్లు మీడియా సమావేశంలో వెల్లడి

షాద్ నగర్,(విజయక్రాంతి): ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేయాలని కలెక్టర్కు మెమొరండం ఇచ్చిన సర్పంచ్ లు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పెంజర్ల ఉపసర్పంచ్ శంతన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ల చెక్ పవర్ ను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో కొత్తూరు మండల ఉపసర్పంచ్లు పాపి రస్ పోర్ట్ లో శుక్రవారం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెంజర్ల ఉపసర్పంచ్ శంతన్ రెడ్డి మాట్లాడుతూ..అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వము అన్ని ఆలోచించే ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చిందన్నారు.ఉపసర్పంచ్ల చెక్ పవర్ తీసేసే అధికారం ఎవరికి లేదని చెప్పారు.ఇప్పటికైనా సర్పంచ్ ఎర్రోళ్ల జగన్ ఉపసర్పంచ్ లకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

ఎస్ బి పల్లి  ఉపసర్పంచ్ సున్నాల గణేష్ మాట్లాడుతూ..ఎర్రోళ్ల జగన్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయా గ్రామాల ఉపసర్పంచులు మాట్లాడుతూ.. సర్పంచులు ఉప సర్పంచులు కలిసి అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.ఉప సర్పంచులు వార్డు మెంబర్లతో కలిసి అభివృద్ధి పటంలో నడవాలని సర్పంచ్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్లు ఎండి సిరాజ్,ఆరోగ్యం,వెంకటమ్మ, స్వరూప,స్వప్న రాందాస్,హనుమంత్ నాయక్, డోపాలా యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.