సమాచారం ఇవ్వలేదని సర్పంచ్‌ల ధర్నా
తాడ్వాయి, మార్చి, 20 (విజయక్రాంతి): తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామాలలో అధికారిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయం ఎదుట తాడువాయి బీ ఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ... రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ముస్లిం సోదరులకు అందించిన దుస్తులను తమకు సమాచారం ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము గ్రామాలకు ప్రథమ పౌరుడిగా ఉండి ఏం లాభమని వారు ప్రశ్నించారు. సర్పంచ్ లకు సమాచారం ఇవ్వకుండా దుస్తులు ఎలా పంపిణీ చేస్తారని వారు ప్రశ్నించారు. మాకు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు దుస్తులు పంపిణీ చేస్తే ఎలా అని మండిపడ్డారు. సర్పంచులకు తాడువాయి సింగిల్ విండో మాజీ అధ్యక్షులు కపిల్ రెడ్డి, మాజీ మండల పరిషత్ వైస్ చైర్మన్ నర్సింలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మెట్టు విజయ రాములు, మంగారెడ్డి, తాజో ద్దీన్ తదితరులు పాల్గొన్నారు.




