31 March, 2026 | 9:37 PM

సామ్య తండాలో నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

31-03-2026 08:06 PM

తేజస్విని రాజేందర్ నాయక్ !!

శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని టిక్య దేవమ్మ గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సామ్యతాండాలో నీటి సమస్యతో బాధపడుతున్నామని గిరిజన సోదరులు స్థానిక సర్పంచ్ తేజస్విని రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే బోర్ వేయించడం జరిగింది. ఆ బోరులో నీరు పుష్కలంగా పడడంతో గిరిజన సోదరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.