14 April, 2026 | 8:27 PM

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్

14-04-2026 04:38 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ కుంజా వినోద్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని పంచాయతీ కార్యాలయం, బ్యాంకుల వద్దకు వచ్చే ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండటం కోసం మినరల్ వాటర్ ను చలివేంద్రం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జలగం మాధవి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి  ఇబ్రహీం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.