దొరల గర్వమణిచిన వీరుడు పాపన్న గౌడ్
పాపన్న ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం
పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు రాంబాబు గౌడ్,
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 316వ వర్ధంతి (ఆత్మ బలిదాన్ దినోత్సవం) వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మండల, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు రాంబాబు గౌడ్ మాట్లాడుతూ... నాటి కాలంలోనే దొరల అహంకారానికి, పెత్తందారుల అరాచకత్వానికి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సామాన్యులను ఏకం చేసి పోరాటం చేసిన ధీశాలి పాపన్న గౌడ్ అని కొనియాడారు. బహుజన రాజ్యాధికారం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదన్నారు. గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు పోలంపల్లి ఆనంద్ బాబు గౌడ్ మాట్లాడుతూ..పాపన్న గౌడ్ ఒక వ్యక్తి కాదని, ఒక గొప్ప శక్తి అని అభివర్ణించారు. కేవలం 12 మందితో తన ప్రస్థానాన్ని ప్రారంభించి,12 వేల మంది సైన్యాన్ని తయారు చేసుకున్న ఆయన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గౌడ కుటుంబంలో అటువంటి వీరుడు జన్మించడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లెపల్లి రామనాదం గౌడ్, మాజీ సర్పంచ్ సంకబుడ్డి నర్సయ్య యాదవ్, మండల నాయకులు బొల్లెపల్లి శ్రీనివాస్ గౌడ్,సొసైటీ చైర్మన్ పురుషోత్తం గౌడ్, దేవాలయ చైర్మన్ గుడుపురి గోపయ్య గౌడ్ జిల్లా నాయకులు నర్సింగ్ అంజయ్య గౌడ్, నాగ సైదులు గౌడ్, బక్కయ్య గౌడ్, గురవయ్య గౌడ్, తుమ్మల వెంకటేశ్వర్లు గౌడ్, ధనమూర్తి గౌడ్, కట్టుకోల సైదయ్య గౌడ్, గుండు సైదులు గౌడ్, నర్సింగ్ వెంకన్న గౌడ్, బొల్లెపల్లి లక్ష్మీనర్సు గౌడ్ యూత్ నాయకులు గుండు వీరబాబు, రమేష్, సతీష్, వినోద్, నాగేశ్వరరావు, సురేష్, యశ్వంత్, అశోక్, వీరాంజి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు




