ధనుష్ సరసన సారా?
విభిన్న కథలతో కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లో కూడా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని, బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు ధనుష్. వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ తన 56వ చిత్రంపై కూడా దృష్టి సారించారు. తమిళ దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారుని తెలుస్తోంది.
ఇందులో ఫీమేల్ లీడ్ కోసం రుక్మిణి వసంత్‌ను ఓకే చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ‘కాంతార’, ‘ఏస్’, ‘మదరాసి’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ప్రస్తుతం చేతిలో వరుస ప్రాజెక్టులు పెట్టుకుని బిజీ అయిపోయింది.
ఈ క్రమంలోనే ‘ధనుష్56’కు గానూ డేట్స్ సద్దుబాటు కావటం సమస్యగా మారిది. ఈ కారణంగా ఈ సినిమా నుంచి రుక్మిణిని తప్పించారట మేకర్స్. ఆమె స్థానంలో ధనుష్ సరసన హీరోయిన్‌గా సారా అర్జున్‌ను లైన్‌లో పెట్టారని సమాచారం. చర్చలు పూర్తయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనేది కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.






