అగ్నివీర్‌కు సాన్వి అకాడమీ విద్యార్థులు
08-06-2026 12:00 AM
కొత్తపల్లి, జూన్ 7 (విజయ క్రాంతి): కరీంనగర్ రేకుర్తి సాన్వి డిఫెన్స్ అకాడమీ, జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నియామకాల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఎర్రంశెట్టి మునిందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ గత ఫిబ్రవరిలో వరంగల్లో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మే 31న ప్రకటించిన ఫలితాల్లో సాన్వి డిఫెన్స్ అకాడమీ విద్యాసంస్థల నుండి ఆర్మీ వివిధ ట్రేడ్ లలో మొత్తం 56మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. పెద్ద మొత్తంలో డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.






