calender_icon.png 16 February, 2026 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్దాల డిమాండ్‌ను బీఆర్‌ఎస్ నెరవేర్చింది

16-02-2026 01:10:54 AM

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి 

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి

రాజాపూర్, ఫిబ్రవరి 15: దశాబ్దాల నుంచి గిరిజన తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీకి దక్కుతుందని పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన బంజారాల ఆరాధ్య దైవం,గిరిజనుల ఆధ్యాత్మిక మార్గదర్శి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రమంతటా అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.

గిరిజనులలో రాజకీయంగా ఎంతో చైతన్యం వచ్చిందని,గిరిజన సోదరసోదరీమణులు సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు మెంబర్ లుగా పాలన చేస్తున్నారన్నారు. రిజర్వేషన్ లు పెంచుకోవడం జరిగిందని,గిరిజనుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినమ్మన్నారు. మిషన్ భగీరథతో మహిళల తాగునీటి కష్టాలు తీర్చామని,సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణంకు స్థలాలు కేటాయించుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు తదితరులు ఉన్నారు.