calender_icon.png 12 February, 2026 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుకోవాలి

12-02-2026 06:38:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న ఖానాపూర్‌లో జరగనున్న జయంతి కార్యక్రమాల నిర్వహణపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖానాపూర్ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పారిశుధ్యం తదితర వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ప్రాంగణంలో అంబులెన్స్‌తో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి తగిన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో రత్న కళ్యాణి, డిటిడిఓ అంబాజీ, ఇతర అధికారులు, ఉత్సవ సమితి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.