24 March, 2026 | 11:09 PM

గ్యాస్ మాఫియాపై ఉక్కుపాదం…

24-03-2026 09:21 PM

- అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు!

- గరిష్ట చిల్లర ద్వారా 955కే గ్యాస్ సిలిండర్ను విక్రయించాలి

- ప్రతి వినియోగదారుడికి సిలిండర్ను ఇంటి వద్దకే అందజేయాలి

- పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మార్చన రఘునందన్

మునుగోడు,(విజయక్రాంతి): గ్యాస్ సిలిండర్లను నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం గ్యాస్ ఏజెన్సీలలో తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న సాయి దుర్గ గ్యాస్ ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినియోగదారుల నుంచి గరిష్ట చిల్లర ధర (ఎం ఆర్ పి 942) కంటే ఎక్కువ వసూలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.గ్యాస్ మాఫియా అక్రమాలపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగదారులను ఎండలో నిలబెట్టి ఇబ్బందులకు గురిచేయడం కూడా సహించబోమని పేర్కొన్నారు. గ్యాస్ సేవల్లో పారదర్శకత పాటించాలని, వినియోగదారులకు న్యాయం చేయాలని ఆయన ఏజెన్సీలను ఆదేశించారు.