మెగా జాబ్ మేళాకు స్పందన
24-03-2026 10:11 PM
ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు స్పందన లభించింది. ఈ మేళాలో క్విస్ కార్ప్, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆదర్శ నెక్సా, వరుణ్ మోటార్స్, ధ్రువంత సొల్యూషన్స్, డి మార్ట్, సాయి లైఫ్ సైన్స్, హెటీరో ఫార్మా, ఫ్యూషన్ ఫైనాన్స్, రాండ్ స్టాండ్ తదితర సంస్థలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందించాయి. 400 మందికి పైగా అభ్యర్థులు పాల్గొనగా 230 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఎంపికైన అభ్యర్థులను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి, టిఎస్కేసి కోఆర్డినేటర్ డాక్టర్ డి శ్రీనివాస్, ఎఫ్ టి యం జి రాజశేఖర్, కళాశాల అధ్యాపకులు అభినందించారు.




