బుట్టాయిగూడెం రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
24-03-2026 09:33 PM
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలకు రామాలయాన్ని బుట్టాయిగూడెం గ్రామ సర్పంచు జాడి రాంబాబు ముస్తాబు చేశారు. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అర్చకులు మంగళవారం రోజు కల్యాణ మండపానన్ని సిద్ధం చేశారు. గురువారం 10:30 గంటల నుంచి కల్యాణతంతు ప్రారంభిస్తారు. స్వామివారికి పట్టువస్ర్తాలు,ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. కల్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.




