నిఘా నీడలోనే ఇసుక తరలింపు జరగాలి
10-04-2026 12:15 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 9 ( విజయక్రాంతి )జిల్లాలో ఇసుక రీచ్ లా వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ఇసుక తరలింపు పూర్తిగా నిఘా నీడలోనే జరగాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం సెండ్ కమిటీతో నిర్వహించిన సమావేశంలోప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే ఇసుక తవ్వకాలు, రవాణా జరగాలని, ఎక్కడైనా అక్రమ తరలింపు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసి అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు.




