22 July, 2026 | 8:20 PM

వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం

22-07-2026 07:12 PM

​వాంకిడి, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో మూడు నెలల పాటు నిర్వహించే వర్షవాస్ కార్యక్రమానికి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా దుర్గం శ్యామ్ రావు దొండుజి దుర్గే, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ ఉపేందర్, కోశాధికారిగా దుర్గం దీపక్, గ్రంథ పఠన కర్తగా కొబ్రగడే కుమార్‌లు ఎన్నికయ్యారు.​

ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ మహూల్కర్, మండల అధ్యక్షుడు దుర్గం దుర్గాజీ, సమతా సైనిక దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం సందీప్‌లు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం వర్షవాస్ సందర్భంగా బుద్ధ విహార్‌లో సావిత్రిబాయి పూలే, రమాబాయి, భీమాబాయిల జీవిత చరిత్రలకు సంబంధించిన మూడు ప్రధాన గ్రంథాలను పఠించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ బాధ్యులను ప్రజాసంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు.