గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి
16-05-2026 06:45 PM
జమ్మికుంట,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. మండల పరిధిలో మడిపల్లి గ్రామంలో శనివారం గ్రామపంచాయతీ కార్మికుల గ్రామ కమిటీ సమావేశం అంబాల సదయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ... గ్రామాలను శుభ్రం చేస్తున్న పంచాయతీ కార్మికులకు గత 8 సంవత్సరాలుగా ఒకే జీతంపై పనిచేస్తున్నారని, ప్రభుత్వాలు పని చేయించుకుంటూ వారి శ్రమదోపిడి చేస్తుందన్నారు. కార్మికుల జీతాలు వెంటనే పెంచాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు.






