సిక్కు అల్లర్ల దోషి సజ్జన్ మృతి
తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్
క్షీణించిన ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి
2018లో దోషిగా నిర్ధారించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 20: సిక్కు అల్లర్ల కేసు (1984) లో తిహార్ జైలులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్ (80) మృతి చెందారు. గురు వారం ఉన్నట్లుండి ఆయన అనారోగ్యం క్షీణించడంతో జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందిరాగాంధీ హ త్య అనంతరం చెలరేగిన అల్లర్లలో ఢిల్లీ కం టోన్మెంట్‌లోని పాలం కాలనీలో ఐదుగురి మృతికి కారణమయ్యారు.
ఈ ఆరోపణలపై సుధీర్ఘంగా కొనసాగిన ఈ కేసుపై 2018 డిసెంబర్ 17న సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అప్ప టి నుంచి జైలులో ఉన్న ఆయన ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు జైలులో ఉన్నాడు. అల్లర్లకు సంబంధించి ఒక కేసులో ఆయన నిర్దోషిగా విడుదల కాగా, మరో రెండు కేసులలో దోషిగా తేలాడు. 1984లో ఇందిరాగా ంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లలో ఢిల్లీలో 2,700మంది, దేశవ్యా ప్తంగా 3,500 మంది మృతి చెందారు. దీనిపై 2000లో జీటీ నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సిఫార్సుల ఆధారంగా 2005 అక్టోబర్ 25న సీబీఐ కేసు నమోదు చేసింది. 2013లో సజ్జన్ కుమార్ నిర్దోషిగా విడుదలయ్యాడు. సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. 2018లో హైకోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.






