calender_icon.png 8 February, 2026 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్ల అభివృద్ధికి చిరునామా శైలజ ఆగిరెడ్డి

08-02-2026 01:40:32 AM

మున్సిపోల్స్‌లో 15వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో 

చేవెళ్ల ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): బండారి శైలజ ఆగిరెడ్డి.. చేవెళ్ల మండలంలో ఈ పేరు తెలియని వారుండరు. మాజీ సర్పంచిగా చేవెళ్లని అభివృద్ధికి చిరునామాగా మార్చిన నేత వారు. మునుపెన్నడూ లేనంత నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసిన ఆమె చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు నుంచి కాం గ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగా రు. ఐదేళ్ల పాటు సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం ఆమెకు కలిసివస్తోంది.

తనను గెలిపిస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తూ ప్రచా రంలో దూసుకెళ్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన శైలజ ఆగిరెడ్డి ప్రజల మధ్య కలిసిమెలిసి ఉండి సేవ చేయడం ద్వారా ప్రజాదరణ పొందారు.  కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ పట్ల ప్రజలకు ఉన్న ఆశలను నెరవేర్చే దిశగా పనిచేస్తానని తెలిపారు. చేవెళ్లను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని నమ్మకంగా చెప్పారు. మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు శైలజ ఆగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 15వ వార్డు తరఫున తమను గెలిపిస్తే అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు.