రాజీవ్‌గాంధీ ఆశయాల స్ఫూర్తితో సద్భావనా మార్చ్
డాక్టర్ కోట నీలిమ
సికింద్రాబాద్, ఆగస్టు20 (విజయక్రాంతి): మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో SR నగర్ బుద్ధనగర్ నుంచి ఉమేష్ చంద్ర విగ్రహం వరకు సద్భావనా మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ని వాళులర్పించి యాత్ర ప్రారంభించారు.
అనంతరం 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం 6ను పంపిణీ చేశారు. తర్వాత రాజీవ్ గాంధీ జ యంతిని పురస్కరించుకొని అన్నదానం ని ర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ కోట నీ లిమ మాట్లాడుతూ.. యువతను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు భారతదేశ ప్రగతికి బలమైన పునాది వేశాయని పే ర్కొన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, ప్రజాస్వామ్యంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ఆయన సంస్కర ణాత్మక ఆలోచనలకు నిదర్శనమని అనా ్నరు.
సాంకేతిక రంగంలో భారత్ను ముందు కు తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని ఆమె తెలిపారు. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం ద్వారా భా రతదేశాన్ని 21వ శతాబ్దానికి సిద్ధం చేయాల ని ఆయన కలలు కన్నారని, ఆ దూరదృష్టి ఫలితంగానే నేడు దేశం సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతోందని అన్నారు. యువత సంక్షేమంపై దృష్టి సారించడం ద్వారా భారత నిర్మాణానికి కృషి చేశారని కోట నీలిమ కొనియాడారు.






