15 July, 2026 | 1:54 PM

Breaking News

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •  

ఎండకి ఎండుతున్న ధాన్యం బస్తాలు

06-05-2026 12:56 AM

రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన బస్తాలు..

నాగిరెడ్డిపేట, మే 5 (విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి గ్రామంలో పాటు మండలంలో మరికొన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన వరి ధాన్యం బస్తాలు రోజుల తరబడి పండుతెండలో ధాన్యం బస్తాల్లో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాసంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు ఐకెపి చేస్తుంది. కాంటచేసి నాలుగు రోజులు నుండి ఎండిపోతున్నాయని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు ఒక లారీ కూడా రావడం లేదని, తూకం చేసిన వరి ధాన్యం సంచులుపై టాపర్లు కప్పి మండుటెండలో మాడిపోతున్నాయని ఇట్టి విషయమై ఐకెపి అధికారులకు లారీలు రావడంలేదని రైతులు ఎంత మొత్తుకున్నా.. వస్తాయి అంటూ నాలుగు రోజుల నుండి కాలయాపన చేస్తూ అశ్రద్ధ వహిస్తున్నారని, మండుటెండలో గ్రామస్తులు రైతులు ఎండకు తట్టుకోలేక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో కొన్ని గ్రామాల్లో మండల అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ ఆదర్యపడవద్దు ధైర్యంగా ఉండాలని పూర్తిస్థాయిలో చివరి వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని భరోసా, ధైర్యం నింపుతున్నారు. కానీ మాసంపల్లి గ్రామంలో తూకం చేసిన వరి ధాన్యం, ధాన్యాన్ని పండించిన రైతులు మండుటెండలో మండుతూ లారీల కోసం ఎదురుచూస్తూ నిరీక్షిస్తున్నారు. అధికార సిబ్బంది స్పందించి కరుణించి మాసానిపల్లి వైపు మొగ్గుచూపి ధాన్యాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలని రైతులు  కోరుతున్నారు. గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి సంవత్సరం అధికారులు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తూ ఇబ్బందులకు గురి చేస్తారని మాసానిపల్లి అంటే అంత చులకనా అని రైతులు గ్రామస్తులు అంటున్నారు.