21 July, 2026 | 7:48 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

సిర్గాపూర్‌లో ఘనంగా మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు

21-07-2026 03:52 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలను సిర్గాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... మల్లికార్జున ఖర్గే దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీకి, దేశ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కొనియాడారు. ఖర్గే మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేసేలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.