29 March, 2026 | 4:28 AM

ఆకట్టుకున్న రోబోటిక్స్ ప్రదర్శనలు

29-03-2026 12:43 AM

కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థుల నిర్వహణ

నిజామాబాద్, మార్చి 28(విజయక్రాం తి): నిజామాబాద్ జిలా కేంద్రంలోని కాకతీ య విద్యాసంస్థలకు చెందిన కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థుల రోబోటిక్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ రామోజీరావు ప్రారంభించారు. ఆయన మాటాడు తూ కాకతీయ విద్యాసంస్థలకు చెందిన ప్రగతినగర్ క్యాంపస్, సుభాష్ నగర్ క్యాంపస్, కేఓఎస్‌ఐ ౨౦ క్యాంపస్‌లకు సంబంధించిన, సుమారు 350కి పైగా ప్రాజెక్ట్‌లను తయారుచేయడం అభినందనీయమన్నారు.

విద్యా ర్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రో బో ఫెస్ట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే లాగ ప్రాజెక్ట్‌లను రూపొందించి ప్రదర్శించడాన్ని అభినందించారు.విద్యార్థులకు పాఠ శాల స్థాయి నుంచే రోబోటిక్స్‌పై నూతన పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నామని, నూతన టెక్నాలజీకి అనుగుణంగా 3డీ డిజైన్‌లు చేయడం, సెన్సార్, గేమ్స్ కోడింగ్ చేయడం వంటివి గొప్పవని డైరెక్టరు తెలుపుతూ విద్యార్థులను అభినందించారు.ఈ ఫెస్ట్‌లో పాఠశాల డైరెక్టరు రజినీకాంత్, రాజా, రామోజీరావు, తేజశ్విని, ప్రిన్సిపాల్‌లు చంద్రశేఖర్, గిరిధర్ రాజ్, రవికాంత్, సుచరిత, వైస్ ప్రిన్సిపాల్‌లు భావన, భూపాల్, కో-ఆర్డినేటర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.