17 April, 2026 | 9:34 PM

Breaking News

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •  

ఉప్పర్‌బస్తీలో నిలిచిన రోడ్డు పనులు

14-04-2026 12:49 AM

ఖైరతాబాద్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని ప్రతాప్ నగర్ ఉప్పర్ బస్తీలో గత మూడు నెలలుగా సాగుతున్న రోడ్డు పనుల జాప్యంపై స్థానిక బస్తీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్తీలో రోడ్డు పనులు మంజూరై నాలుగు గల్లీలలో పూర్తి అయినప్పటికీ ఒక గల్లీలో చివరి లైన్ సమస్య కారణంగా పనులు నిలిచిపోయాయి.

దీనివల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ బస్తీవాసులు రాము, ధనరాజ్, శౌరీరాజ్, ఆనంద్, సాయి కిరణ్ తదితరులు సోమవారం ఎమ్మెల్యే కాలనీలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గోవర్ధన్ అత్యవసరం గా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.