17 April, 2026 | 11:11 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సుల్తానాబాద్‌లో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి

14-04-2026 12:50 AM

సుల్తానాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 27వ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు, శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,

ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన అభివృద్ధి ఆయన చేసిన సేవలు మరువలేను అని కొనియాడారు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుదిల్లా శ్రీధర్ బాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా నడి బోడ్డున మాజీ స్పీకర్ స్వర్గీయులు శ్రీపాద రావు విగ్రహం తయారై ఉంది అని ,మళ్లీ జయంతి ఉత్సవాల వరకు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటామని అన్నయ్య గౌడ్ అన్నారు,

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్ , మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్బయ్య గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.