పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై సమీక్ష
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జూన్ 1 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి నేరేడుతో కలిసి కార్యక్రమాలు నిర్వహణ, కార్యాచరణ ప్రణాళిక, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపు వంటి చర్యలపై చర్చించారు.
పర్యావరణ పరిరక్షణ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటడం పై అవగాహన ర్యాలీలు, వివిధ సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రకృతి సంరక్షణ పై చర్చ వేదికలు, స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్థాయిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.






