తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దెముల్ తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్(Revenue Inspector) లేకపోవడంతో ఆదాయం ధ్రువీకరణ పత్రం కోసం ప్రజలు తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ పడి గాపులు పడుతున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఆర్ఐ రిచర్డ్ సైమన్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో ఆర్ ఐ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కందనెల్లి గ్రామానికి చెందిన వరుణ్ అనే యువకుడు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. అతడికి స్కాలర్షిప్ కోసం ఇన్కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి ఈనెల 30 తేదీ వరకు వైద్య కళాశాలలో అందించాలి. విద్యార్థి తండ్రి అరిగే శ్రీనివాస్ గత 15 రోజుల నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
ఓమ్లా నాయక్ తండా కు చెందిన యువరాజ్ చౌహాన్ నల్గొండ కళాశాలలో బీఎస్సీ, ఏం ఎల్ టి మొదటి సంవత్సరంలో చేరాడు స్కాలర్షిప్ కొరకు ఇన్కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో విద్యార్థి సోదరి జ్యోతి పది రోజుల నుండి తాసిల్దార్ కార్యాలయానికి తిరుగుతోంది. అధికారులు స్పందించి త్వరగా ఆదాయం ధ్రువీకరణ పత్రం అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా అసిస్టెంట్ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పెద్దెములు తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సుధ డిప్యూటేషన్ పై బషీరాబాద్ వెళ్లారు.




