ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?
- అక్రమ అరెస్టులకు నిరసనగా పలు పార్టీల నేతలు పోలీసు స్టేషన్ ముట్టడి.
- బేషరతుగా నాయకులను విడుదల చేయాలని డిమాండ్.
- పోలీసుల తీరుపై సర్వత్రా నిరసన.
- రాజకీయ,విద్యార్థి,మహిళా,ప్రజా సంఘాల మద్దతు.
వనపర్తి,(విజయక్రాంతి): అభం శుభం ఎరుగని ఓ చిన్నారిపై కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ పాఠశాల హాస్టల్ వార్డెన్ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రం లో ఆలస్యంగా వెలుగులోకి రాగా సోమవారం పాఠశాలలో మైనారిటీ బాలికపై జరిగిన లైంగిక దాడి గురుంచి ప్రశ్నించడానికి వెళ్ళిన నాయకులు నందిమల్ల అశోక్, చీర్ల చందర్,మెకానిక్ శ్రీనుతో పాటు మరో 6మందిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం బి ఆర్ ఎస్, బిజెపి, పలు పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు.
అక్రమంగా అరెస్టు చేసిన నాయకుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితున్ని యాజమాన్యాన్ని కాపాడాలని ఎం.ఎల్.ఏ చేసిన భారీ కుట్రలో బాగంగా నాయకులను అరెస్ట్ చేశారని వారిని బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరంగా బాధిత బాలికకు, కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షములో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంచేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాజశేఖర్ గౌడ్, పెద్దిరాజు, మున్సిపల్ కౌన్సిలర్సు మురళి సాగర్ శ్రీకర్ గౌడ్ చింటూ బి ఆర్ ఎస్ నాయకులు కాగితాల లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్, సమద్ స్టార్ రహీం, హేమంత్ ముదిరాజ్, జోహార్ హుస్సేన్, సూర్యవంశం గిరి, యుగంధర్ రెడ్డి, చిట్యాల రాము,సి.పి.ఎం నాయకులు పరమేశ్వరా చారి , సి.పి. ఐ నాయకులు గోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు




