31 May, 2026 | 7:35 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం

31-05-2026 06:33 PM

ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు  ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం నిర్వహించారు. టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు,  దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీ ఎన్జీవోల అధ్యక్షులు, మారం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో సూపరింటెండెంట్‌ గా సేవలందించి పదవీ విరమణ పొందిన చింతలపల్లి రాజి రెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం చింతలపల్లి రాజిరెడ్డి, ఇరిగేషన్ శాఖకు చెందిన ఒంటెల వెంకటరెడ్డి మరియు రవీందర్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సహజమైన ప్రక్రియ అయినప్పటికీ వారు ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.