15 June, 2026 | 3:14 PM

Breaking News

తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •  

పాకిస్థాన్‌పై ప్రతికార దాడులు నిజమే!

13-10-2025 01:21 AM
  1. 58మంది పాక్ సైనికులు హతం.. మరో 30 మందికి గాయాలు
  2. మా ఆధీనంలో 25 ఆర్మీ పోస్టులు 
  3. తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడి

కాబుల్, అక్టోబర్ 12: తమ దేశ రాజధాని కాబుల్‌తో పాటు ఓ మార్కెట్‌పై పాకిస్థాన్ బాంబు దాడులకు పాల్పడిందని.. ఈ నేపథ్యంలో పొరుగు దేశ దళాలే లక్ష్యంగా ప్రతికార దాడులు చేపట్టామని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఈ దాడుల్లో తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని, మరో 30మంది గాయపడ్డారని వెల్లడించారు.

ఇస్లామాబాద్ పదే పదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాదులను ఆశ్రయం కల్పించొద్దని హెచ్చరిం చింది.  కాగా, ఇటీవల అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ లక్ష్యంగా పాక్ యుద్ధ విమానాలు దాడి చేసినట్లు ఆ దేశ రక్షణ విశ్లేషణ సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే, ఈ దాడులపై ఇస్లామాబాద్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్నప్పుడు ఈ దాడులు జరిగాయి.