22 March, 2026 | 6:02 PM

గల్ఫ్‌లో క్షిపణి దాడిలో మహబూబాబాద్ జిల్లా వాసి మృతి

22-03-2026 04:21 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒక నిరుపేద కుటుంబంలో తీరని శోకాన్ని నింపాయి. మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రవిగోపాల్ అనే వ్యక్తి సౌదీలో జరిగిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఉపాధి నిమిత్తం గత కొంతకాలంగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్న రవిగోపాల్, ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల సమయంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.