దొడ్డు బియ్యం తీసుకెళ్లాలని వినతి
31-03-2026 12:00 AM
నస్పూర్, మార్చి 30 : జిల్లాలోని రేషన్ దుకాణాలలో నిలువ ఉంచిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు జిల్లా రేషన్ డీలర్ల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. వచ్చే నెల మూడు నెలల సన్న బియ్యం పంపిణికి సంబందించిన డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్‌కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోటపలుకుల సత్తయ్య, సుధమల్ల కృష్ణ, సళ్ళ రవి కుమార్, ఉస్కమల్ల శంకర్, బానేష్ రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.




