10 March, 2026 | 3:41 AM

ఫైనల్‌కు రికార్డ్ వ్యూయర్‌షిప్

10-03-2026 01:18 AM

అహ్మదాబాద్, మార్చి 9: ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం నుంచీ అభిమానుల ను విశేషంగా ఆకట్టుకుంది. ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టైటిల్ సొంతం చేసుకుంది. భారత్ టైటి ల్ పోరులో ఆడడంతో వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. నిజానికి వెస్టిండీస్‌తో నాకౌట్ మ్యాచ్, తర్వాత ఇం గ్లాండ్‌తో సెమీస్‌కు కూడా రికార్డు స్థాయిలో రేటింగ్స్, వ్యూయర్‌షిప్ నమోదయ్యాయి. తాజాగా ఆ రికార్డులన్నింటినీ ఫైనల్ మ్యాచ్ బ్రేక్ చేసింది.

వ్యూస్ పరంగా అత్యధికమంది చూసిన మ్యాచ్‌గా నిలిచింది. దాదాపు 82.1 కోట్లమంది ఈ మ్యాచ్‌ను వీక్షించినట్లు జి యోహాట్‌స్టార్ వెల్లడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు గాయకుడు రికీ మార్టిన్ ప్ర దర్శన సమయంలో 2.1 కోట్లుగా ఉన్న వ్యూ యర్‌షిప్ టాస్ వేసే సమయానికి 4.2 కోట్ల కు పెరిగింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ వ్యూయర్‌షిప్ పెరుగుతూనే ఉంది. న్యూజిలాండ్ చివరి వికెట్ పడే సమయానికి 74.5 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించగా.. భారత జట్టు సంబరాలు చేసుకునే సమయానికి ఆ సంఖ్య 82.1 కోట్లకు పెరిగినట్లు తెలుస్తోంది. జియోహాట్‌స్టార్‌లో ఒక ఐసీసీ ప్ర పంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ఇంత మంది వీక్షకులు చూ డడం ఇదే మొదటి సారి.