రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూళ్లు
జూలై ఆదాయం 2.11 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 1: జీఎస్టీ వసూళ్లు జూలై లో రూ. 2.11 లక్షల కోట్లుగా నమోదయ్యా యి. గతేడాది ఇదే సమయంలో రూ. 1.94 లక్షల కోట్ల వసూళ్ల కంటే ఇది 15.4 శాతం అధికం కావడం గమనార్హం. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ వసూళ్ల వివరాలను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల కోట్ల వసూళ్లను దాటడం ఇది రెండోసారి. తొలిసారి ఏప్రిల్‌లో జీఎస్టీ కలెక్షన్లు రూ. 2.43 లక్షల కోట్లు వసూలయ్యా యి.
అదే సమయంలో కేంద్ర జీఎస్టీ ఆదాయం రూ.39,835 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 47,881 లక్షల కోట్లు, ఐజీఎస్టీ రూ. 1.23 లక్షల కోట్లుగా నమోదైంది. జూలై రీ ఫండ్ల విలువ రూ. 29,968 కోట్లు కాగా సర్దుబాటు అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు రూ. 1.81 కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర రూ. 32,210 కోట్లు సాధిం చి తొలి స్థానంలో నిలిచింది. గుజరాత్ 19 శాతం వృద్ధితో రూ. 12,923 కోట్లు, కర్ణాటక రూ. 13,854 కోట్లు, 12శాతం వృద్ధి, ఉత్తర ప్రదేశ్ 15శాతం వృద్ధితో రూ. 9,651 కోట్లు పెరుగుదల నమోదైంది.
మధ్యప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు 10 శాతం తగ్గగా, తమిళనాడు 1 శా తం, ఆంధ్రప్రదేశ్ 5 శాతం, సిక్కిం అత్యల్పం గా 59 శాతం, హిమాచల్ ప్రదేశ్ 2 శాతం, ఉత్తరాఖండ్ 18 శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గిం ది. కాగా ఈ గణాంకాలు తాత్కాలికమైనవని, తుది గణాంకాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక 2017 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానాన్ని అమలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వివిధ రకాల 17 పన్నులు, 13 సెస్సులను జీఎస్టీలో విలీనం చేసి ౪ భాగాలుగా విభజించారు. ఇందులో సీజీఎస్టీ (సెంట్రల్‌జీఎస్టీ) కేంద్రం ద్వారా వసూలు చేయబడుతుంది. ఎస్జీఎస్టీ (రాష్ట్ర జీఎస్టీ)- రాష్ట్ర ప్రభు త్వాలు వసూలు చేస్తాయి. ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ)- ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించబడి, అంతర్రాష్ట్ర లావాదేవీలు, దిగుమతు లపై వర్తిస్తుంది. సెస్- ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం నిధులు సేకరించడానికి కొన్ని వస్తువులపై విధించే అదనపు రుసుముగా విభజించారు.






