అధికారం కోసం అడ్డగోలు హామీలు..వచ్చాక మాయమాటలు..!
23-08-2026 03:29 PM
కోటపల్లి, (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాయమాటలు చెబుతూ కాలం వెల్లధీస్తుందని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల సోషల్ మీడియా కన్వీనర్ బాపు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలతో గద్దెనెక్కి.., రాష్ట్ర ఆదాయాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటాయనీ, హామీలు మాత్రం అమలుకు నోచుకోలేదన్నారు. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను మరిచి డ్రామాలు చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలకు కాలం చెల్లిందనీ..? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు






