బీఆర్ఎస్ సీనియర్ నాయకుని మృతి
23-08-2026 03:55 PM
నిజాంసాగర్ ఆగష్టు 23( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గైనీ విట్టల్ ఆదివారం నాడు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సామాన్య కార్యకర్త నుండి సర్పంచ్‌గా, మండల పార్టీ అధ్యక్షునిగా, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. ఆయన మృతి, టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు మిగిల్చిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.






