21 August, 2026 | 3:52 AM

భీమారం పీఎస్‌ను తనిఖీ చేసిన డీసీపీ

21-08-2026 01:49 AM

జైపూర్, ఆగస్టు 20 : మంచిర్యాల జిల్లా జైపూర్ సబ్డివిజన్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ గురు వారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది కిట్ సామగ్రి, దుస్తుల ధరింపు, క్రమశిక్షణ తదితర అంశాలను డీసీపీ పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి విధుల నిర్వహణ,పనితీరు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలు, ముఖ్యమైన రికార్డులు,కేసు దస్త్రాలను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు,కేసులను సకాలంలో పరిష్కరించాలని, కేసులు, ఇతర వివరాలను సీసీటీఎన్‌ఎస్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, న్యాయస్థానాలతో సమన్వయంతో పనిచేస్తూ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని డీసీపీ పేర్కొన్నారు. ఈ తనిఖీలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్, ఎస్‌ఐ రాజేందర్ పాల్గొన్నారు.