23 August, 2026 | 3:38 PM

రాహుల్ గాంధీకి రాంచందర్ రావు సవాల్

23-08-2026 02:42 PM

హైకోర్టును కాంగ్రెస్ ప్రభుత్వమే నడుపుతుంది..

విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటుంది..

కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి..

22ఏ భూముల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తాం.

న్యూఢిల్లీ: బకాయిలు పెండింగ్(Pending dues)లో పెట్టి విద్యార్థులతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఆడుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుఆదివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు బకాయిలు పెడితే, ఈ ప్రభుత్వం నాలుగు వేల కోట్లు బకాయిలు పెంచిందని ఆరోపించారు. హైకోర్టును కూడా ప్రభుత్వమే నడుపుతోందని రామచందర్ రావు(Ramchander Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిపాలనను ప్రభుత్వం సరిగా నడపడం లేదని ఆరోపించారు. 22ఏ భూములపై చర్చిస్తున్నామని, 22ఏ భూముల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీకి రామచందర్ రావు సవాల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్. రామచందర్ రావు సవాల్  వేశారు. విద్యార్థుల సమస్యలపై ఎక్కడో సభ పెట్టడం కాదు.. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్ లో సభ పెట్టాలని డిమాండ్ చేశారు.