పార్టీ అంతర్గత వ్యవహారాలు ప్రతిపక్షాలకు ఆయుధం
కాంగ్రెస్ మహా శక్తి
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలిగిందని మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) తెలిపారు. ముందు పార్టీ.. తర్వాతే వ్యక్తులు.. పార్టీని కాపాడే బాధ్యత అందరిపై ఉందని మంత్రి వెల్లడించారు. ఎవరైనా పార్టీ లైన్ దాడి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
కొండా సురేఖపై(Minister Konda Surekha ) కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి లేదని స్పష్టం చేశారు. చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారని మంత్రి సూచించారు. సురేఖపై ఏ నిర్ణయమైనా పార్టీ తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ లో అదృశ్య శక్తులు ఉండని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ మహా శక్తిగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాడినా చర్యలు తప్పవు.. తాను పార్టీ లైన్ దాటినా చర్యలు ఉంటాయని సూచించారు. త్వరలోనే సమస్యలన్నీ సమసిపోతాయని పేర్కొన్నారు.






