28 August, 2026 | 1:50 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

‘రంభ ఊర్వశి మేనక’.. థియేటర్లలో వేడుక

28-08-2026 12:00 AM

అల్లరి నరేశ్(Allari Naresh) ఫాంటసీ కామెడీ ‘రంభ ఊర్వశి మేనక’(Rambha, Urvashi, Menaka)తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios), హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఇందులో సురభి, రాశిసింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటించగా, వెన్నెల కిషోర్, నరేశ్ వీకే, శ్రీనివాస్‌రెడ్డి, రచ్చ రవి, మురళీధర్‌గౌడ్ ఇతర ముఖ్యపాత్రలను పోషించారు.

ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గురువారం టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘రంభ ఊర్వశి మేనక.. స్టెప్ వేస్తే తెల్లార్లూ వేడుక..’ అంటూ సాగుతున్న ఈ పాట సంగీతప్రియుల్లో జోష్ నింపుతోంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్. చాలా కొత్తగా, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది.

ఈ సినిమా కోసం ఆహార నియమాలు చాలా కఠినంగా పాటించాను. షూటింగ్ కూడా మాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది” అని తెలిపింది. ప్రిశా సింగ్ మాట్లాడుతూ.. “ఈ సాంగ్‌కు అందరూ డాన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఈ పాట నచ్చుతుంది. సెప్టెంబర్ 4న అందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా” అని చెప్పింది.

విష్ణుప్రియ మాట్లాడుతూ.. “థియేటర్‌లో ఈ పాట అందరినీ సీట్లో నుంచి లేచి డాన్స్ చేసేలా చేస్తుంది. ఇప్పటివరకు రంభ, ఊర్వశి, మేనకలు ఒక డాన్స్‌కో, సన్నివేశానికో రావడం చూశాం. కానీ ఈ కథ మాత్రం చుట్టూ రంభ, ఊర్వశి, మేనకల చుట్టూనే తిరుగుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ” అని తెలిపింది.