28 August, 2026 | 9:06 PM

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

28-08-2026 03:43 PM

మోతె, ఆగస్టు 28 (విజయక్రాంతి): ప్రేమ సోదరా భావం ... ఆప్యాయతకు ... ప్రతికగా నిలిచే రాఖీ పండుగను  మోతె మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు, నీకు నేను రక్ష... నాకు నువ్వు రక్ష అంటూ చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు, సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు, అలాగే శ్రావణ పౌర్ణమి శుక్రవారం పురస్కరించు కొని  ఇళ్లల్లో ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి, సాంప్రదాయ దుస్తులతో దేవుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు.  మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ రక్షాబంధన్ వేడుకలను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు.