ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు మహిళా కార్యకర్తల ఆత్మీయ శుభాకాంక్షలు
28-08-2026 03:40 PM
ఉట్నూర్, ఆగస్టు 28,(విజయక్రాంతి):రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆయన సోదరీమణులు, కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టి ఆత్మీయంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళా కార్యకర్తల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాఖీ బంధం సోదర ప్రేమకు, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళల సంక్షేమం, భద్రత మరియు అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సోదరీమణులు రాఖీ కట్టగానే వారికి నూతన వస్త్రాలను బహుకరించారు.






