19 June, 2026 | 11:00 PM

పేద ప్రజల సంక్షేమం కోరేది కాంగ్రెస్ పార్టీ

19-06-2026 04:18 PM

బోథ్,(విజయక్రాంతి): పేద ప్రజల సంక్షేమం కోరి మున్సిపాలిటీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రాహుల్ గాంధీ సూచనలు సలహాలు ఎన్నో ఉన్నాయని ఆయన అడుగుజాడల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో బోథ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నరసింహ దాస్ నాయకులు మెరుగు భోజన్న నాగేందర్ చంద్రమోహన్ తదితరులు ఉన్నారు