10 July, 2026 | 7:58 PM

Breaking News

12న జిల్లా అథ్లెటిక్స్ పోటీలు   •   అశ్వాపురంలో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు   •   కౌన్సిలర్ వరప్రదీప్ కు అభినందనల వెల్లువ   •   13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత   •   ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •  

3.49 క్వింటాళ్ల హైగ్రేడ్ కొకైన్ స్వాధీనం

02-05-2026 02:57 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో సరుకు విలువ 1,745 కోట్లు

ముంబై ఎన్సీబీ బృందం ‘ఆపరేషన్ వైట్ స్ట్రుక్’

గ్యాంగ్‌స్టర్ సలీం భారత్‌కు తీసుకువచ్చిన కొన్నిగంటల్లోనే ఆపరేషన్

డ్రగ్స్ ముఠాల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తాం: కేంద్రమంత్రి అమిత్‌షా

ముంబై, మే ౧: ముంబై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందం శుక్రవారం కలంబోలి - భివాండి కారిడార్‌లో మెరుపు దాడులు చేసింది. ‘ఆపరేషన్ వైట్ స్ట్రుక్’ అనే పేరుతో చేపట్టిన ఈ అపరేషన్‌లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 3.49 క్వింటాళ్ల హైగ్రేడ్ కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో రూ.1,745 కోట్లు ఉంటుందని ఓ అంచనా.

తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా మోస్ట్‌వాంటెడ్ క్రి మినల్ దావూద్ అనుచరుడు, స్మగ్లర్, గ్యాం గ్‌స్టర్ సలీం డోలాను తుర్కియే భారత్‌కు అప్పగించిన కొన్నిగంటలకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. విచారణలో డోలా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్సీబీ ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిసింది. డోలా రెండు దశాబ్దాలుగా సలీం డోలా మ హారాష్ట్ర, గుజరాత్‌కు డ్రగ్స్ సరఫరా చేసే అంతర్జాతీయ ముఠాను నడుపుతుండగా, ఇటీవల ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేయడంతో డోలాను అదుపులోకి తీసుకోవడం సాధ్యమైంది.

ఈ ఆపరేషన్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ ద్వారా స్పం దించారు. ముందుగా ఎన్సీబీ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. డ్రగ్స్ రహి త భారత్ తమ ముందున్న లక్ష్యమని ఉద్ఘాటించారు. డ్రగ్స్ ముఠాల నెట్‌వర్క్‌ను కూక టివేళ్లతో పెకిలిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విదేశాల నంపచి మాదక ద్రవ్యాల సరఫరా గొలుసును తెంచేందుకు తాము ఎంతటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటామని తెలిపారు.