నగరంలోని వర్ష ప్రభావిత ప్రాంతాలన పరిశీలన
30-07-2026 02:01 PM
ముకరంపుర, జూలై 30(విజయ క్రాంతి) నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరంలోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ రోడ్డులో గల ప్రధాన మురుగు నీటి వరద కాలువను తనిఖీ చేసి పరిశీలించారు.కలెక్టరేట్ రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ లోకి ప్రవహించేలా చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉండి అధికార సిబ్బంది తో ఫుట్ పాత్ వీప్ హోల్స్ ను తెరిపించారు. నగరపాలక సంస్థ అధికార, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ... ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈలు లచ్చిరెడ్డి, డిజాస్టర్ సిబ్బంది పాల్గొన్నారు.






