13 March, 2026 | 3:05 AM

99 రోజుల ప్రణాళికలో ప్రజాప్రతినిధులే కీలకం

13-03-2026 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మార్చి 12 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

గురువారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్స్ లో గ్రామపంచాయతీ సర్పంచ్ లు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ , డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మున్సిపాలిటీల చైర్ పర్సన్ లు, వైస్ చైర్ పర్సన్ లు, కౌన్సిలర్లకు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి డిసిపి ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, వివిధ శాఖ ల జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక  జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరిగిందని ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వాములై జిల్లా అభివృద్ధి కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజాసంక్షేమం ఉందిగా ప్రజా ప్రతినిధులకృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.