10 March, 2026 | 1:22 AM

22ఏ నిషేధిత జాబితాతో ప్రజల్లో తీవ్ర గందరగోళం

10-03-2026 12:02 AM

బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్

గుట్ట తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా

యాదగిరిగుట్ట, మార్చి 9 : 22 ఏ జాబితాతో యాదగిరిగుట్ట పట్టణంలో తీవ్ర గందరగోళం ఏర్పడిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, దీనిని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించకపోతే ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుందని  బిజెపి జిల్లా అధ్యక్షులు ఉట్కూరి  అశోక్ గౌడ్ అన్నారు.

సోమవారం భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ ఆక్ట్ 1977 సెక్షన్ 22 ఏ తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎమ్మార్వో ఆఫీస్ ముందు బాధితులతో పెద్ద ఎత్తున  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్ మాట్లాడుతూ గతంలో బడుగు బలహీన వర్గాలకు అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయానికి మరియు ఇండ్లు నిర్మించేందుకు ప్లాట్లు కేటాయించడం జరిగిందని, వాటిలో ప్రజలు కష్టార్జితంతో ఇండ్లు నిర్మించుకోవడం జరిగిందని. ఇప్పుడు వెంటనే 22 ఏ తో ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టడంతో స్థానిక బీసీ, ఎస్సీ,ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని వారికి న్యాయం వారికి న్యాయం జరిగే వరకూ వారికి అండగా బిజెపి పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

రిజిస్ట్రేషన్ ఆక్ట్ 1977 సెక్షన్ 22a ప్రకారం ఇండ్లని, వ్యవసాయ భూములను నిషేధ జాబితాలు పెట్టడం జరిగిందిని దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.

యాదగిరిగుట్ట లోని బీసీ కాలనీ,ఇందిరా కాలనీ, ఎస్సీ కాలనీ, బేడ బుడగ జంగాల కాలనీలో బడుగు బలహీన వర్గాల ప్రజలు భయాందోళనకు  గురవుతున్నారని, ప్రజల సమస్యలను ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని బిజెపి పార్టీ ప్రజల కోసం ఉద్యమం చేస్తుందని కేసులకు కోసం భయపడదని అన్నారు. బిజెపి పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ  ఈ ఆక్ట్ ని సవరించి ఈ చట్టం కింద గుర్తించబడినటువంటి 760 ఇండ్లని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలతో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందిని అన్నారు. 

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, స్టేట్ కౌన్సిల్ నెంబర్ రచ్చ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు గుంటుపల్లి మహేశ్వరి సత్యనారాయణ, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల చంద్రమౌళి,గంధ మల్ల మహేష్, గోపగాని ప్రసాద్, టౌన్ జనరల్ సెక్రటరీ జేల్లా భానుచందర్, కౌన్సిలర్లు  బోడ రాధ, సురేష్ కర్రె మాధవి, కార్యదర్శులు దొమ్మాట ప్రభాకర్,సీనియర్ నాయకులు తాళ్ల భాస్కర్ రెడ్డి  పాల్గొన్నారు.