30 May, 2026 | 1:03 AM

సంక్రమిక వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన ముఖ్యం

30-05-2026 12:23 AM
  1. దోమల నివారణకై చెన్నా పురం పరిధిలో ఫ్రైడే డ్రై డే                     
  2. కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వసంత

జవహర్ నగర్, మే 29 (విజయక్రాంతి): సాంక్రమిక వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన ముఖ్యమని దోమల నివారణకై ప్రతి ఒక్కరు అప్రమత్తతతో నివారణ చర్యలు తీసుకోవాలని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత  అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్లోని చెన్నాపురంలో శుక్రవారం ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో దోమల నివారణపై అవగాహన (ఫ్రైడే డ్రై డే) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కీసర డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత హాజరై మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు సాంక్రమిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకై ప్రతి ఒక్కరు నివారణ చర్యలు తీసుకోవాలని చికిత్స కంటే నివారణే ఉత్తమ మార్గమని తెలిపారు. దోమల నివారణకై పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ మురుగునీరు నిలువలు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

ఇంటి పరిసర ప్రాంతాలలోని చెత్త చెదారం నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచినప్పుడే దోమలను అరికట్ట వచ్చునని తెలిపారు. ఇంటి ఆవరణలో నీటి తొట్లు పాత టైర్లు తదితర రేకు డబ్బాలు ఉండకుండా చూచుకోవాలని నీటితోట్లే దోమలకు ఆవాస కేంద్రాలని ఆవాసాలను రోజు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. దోమ పుట్టకుండా ప్రత్యేక పద్ధతులతో దోమల నివారణ పై అవగాహన పెంచుకోవడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ భాస్కర్, తిరుపతి, రాజు, వార్డ్ ఎంట మాలజీ సూపర్వైజర్లు శ్రీనివాస్, స్వామి, కాలనీ అసోసియేషన్ సభ్యులు, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.