30 May, 2026 | 1:04 AM

‘సర్’పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

30-05-2026 12:23 AM

ఎంపీ డాక్టర్ కడియం కావ్య 

హనుమకొండ అర్బన్, మే 29 (విజయక్రాంతి): ప్రతి ఆరుగురికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా బీ ఎల్ ఎ, బీ ఎల్ వో లు కలిసి ప్రతి ఇంటికి ప్రచారం చేపట్టాలని, రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘సర్’ విధానం అమలు తీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రతి బూత్ ఏజెంట్ పార్టీకి సైనికుడిలా పనిచేయాలని, ఓటు చోరీ ప్ర యత్నాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

పరకాల ఎన్‌ఎస్‌ఆర్ కన్వెన్షన్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సదస్సుకు శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి,  జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మహ్మద్ అ యూబ్‌తో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్‌ఐఆర్  ప్రక్రియ, ఓటర్ల జాబి తా నిర్వహణ, బూత్ స్థాయి బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె కావ్య మాట్లాడుతూ, ప్రతి బూ త్ ఏజెంట్ పార్టీకి సైనికుడిలా పనిచేయాలని సూచించారు.

క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు, ఓటర్ల వివరాలు, ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రజలు తరచూ నివాస ప్రాంతాలు మార్చ డం, అద్దె ఇళ్లలో నివసించడం, ఉద్యోగాల కారణంగా చిరునామాలు మారడం వల్ల ఓ టర్ల జాబితాలో ఖచ్చితత్వం నిలుపుకోవడం సవాల్గా మారుతోందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చెరువు పూడిక తీత పనులు ప్రారంభం

హనుమకొండ అర్బన్, మే 29 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపూర్లోని ఊర చెరువు సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పూడికతీత పనులకు ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువు సామర్థ్యం పెరిగి వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

ముఖ్యంగా వర్షాకాలంలో గోపాలపూర్ పరిసర ప్రాంతాల్లో ఎదురయ్యే వరద ముంపు సమస్యలను తగ్గించేందుకు ఈ పూడికతీత పనులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం అవసరమని, చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.